- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cyclone: దూసుకొస్తున్న తుపాన్.. తమిళనాడులో భారీ వర్షాలు కురిసే చాన్స్ !
దిశ, నేషనల్ బ్యూరో: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మరో రెండు రోజుల్లో శ్రీలంక (Srilanka) తీరాన్ని దాటి తమిళనాడు (Thamilnadu) వైపు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8.30 గంటల నాటికి త్రికోణమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 710 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయం, చెన్నయ్‌కి 800 కిలోమీటర్ల దూరంలో లోతైన అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. నవంబర్ 27న ఇది మరింత తీవ్ర మయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజుల్లోగా శ్రీలంక సముద్ర తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపుకదల నుందని, దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో బలపడుతున్న తుపానులు ఆంద్రప్రదేశ్, తమిళనాడు వైపు కదులుతాయని తెలిపింది. ఈ టైంలో గంటకు 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.