మహాలక్ష్మి నగర్ మార్గం మార్చేందుకు కృషి చేస్తా

by Sridhar Babu |
మహాలక్ష్మి నగర్ మార్గం మార్చేందుకు కృషి చేస్తా
X

దిశ, కాప్రా : చర్లపల్లి రైల్వే టెర్మినల్ మార్గం కోసం ప్రత్యామ్నాయం రహదారులు ఉన్నపటికీ మహాలక్ష్మి నగర్ కాలనీలోని ఇళ్లు తొలగించాలని అధికారులు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునేలా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారిని మంగళవారం చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ నూతన కార్యవర్గం కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు విన్నవించారు. సీసీఎస్ చేపట్టే కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించి నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. సీసీఎస్ తీసుకొచ్చే ప్రజల సమస్యలను వందశాతం పరిష్కారం చేస్తానని భరోసా ఇచ్చారు.

అధికారులు సైతం సీసీఎస్ వేదికగా వెలుగులోకి వచ్చే ఇబ్బందులు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షుడు ఎంపల్లి పద్మా రెడ్డి, నాయకులు నేమురి మహేష్ గౌడ్, ఉపాధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి, గంప కృష్ణ, శ్రీనివాస్ నాయక్, కట్కూరి బుచ్చిరెడ్డి, పనగట్ల చక్రపాణి గౌడ్, సారా వినోద్ ముదిరాజ్, సింగిరెడ్డి నరసింహారెడ్డి, యావపురం రవి, బీవీ నరసింహారెడ్డి, బర్ల రామచంద్రారెడ్డి, కొండగళ్ల అశోక్, షాబాద్ దామోదర్ రెడ్డి, ఉల్లెంగుల శివలింగం, శ్యామ్, లంక దాసరి సుధాకర్, కొమ్ము రమేష్, కొమ్ము సురేష్, రాళ్ల బండి శ్రీనివాస్, వీరబ్రహ్మం, జైపాల్ రెడ్డి, తిరుమల కృష్ణ గౌడ్, బూరుగు నరసింహ, శ్రీశైలం, చలమారెడ్డి, నరసింహారావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story