గ్రామీణ సమస్యలపైన ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే పల్లా

by Kalyani |
గ్రామీణ సమస్యలపైన ప్రత్యేక దృష్టి :  ఎమ్మెల్యే పల్లా
X

దిశ,చేర్యాల : గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దానంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.44 లక్షల వ్యయంతో చేపట్టే గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయ భవనం, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని, ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నానని,గ్రామాలలో ఉన్న ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన వివిధ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు చేర్యాల పట్టణ కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మడేలేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సీ చైర్ పర్సన్ నల్ల నాగుల శ్వేత-వెంకటాచారి,పిఏసీఎస్ చైర్మన్ మెరుగు శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ మహబూబ్ అలీ, మాజీ ఎంపీపీ కరుణాకర్, మాజీ సర్పంచ్ బుర్ర సబిత, ఎల్లారెడ్డి,మాజీ ఎంపీటీసీ ఎలికట్టె శివశంకర్ గౌడ్, బీఆర్ఎస్ మండల,పట్టణ అధ్యక్షులు అనంతుల మల్లేశం, డాక్టర్ గదారాజు చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed