- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్సీబీ పగ్గాలు మళ్లీ కోహ్లీకేనా?..
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీని మళ్లీ సారథిగా చూడబోతున్నామా?.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పగ్గాలు తిరిగి చేపట్టబోతున్నాడా?.. ఆర్సీబీ అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. వచ్చే సీజన్‌లో కోహ్లీ తిరిగి ఆర్సీబీని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ వేలంలో బెంగళూరు వ్యూహాన్ని పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఆక్షన్‌లో పంత్ లేదా కేఎల్ రాహుల్‌ను బెంగళూరు తీసుకుని కెప్టెన్నీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆర్సీబీ వారిద్దరినీ కొనుగోలు చేయలేదు. తీసుకున్న వారిలో కూడా కెప్టెన్సీ సామర్థ్యం ఉన్న ప్లేయర్లు లేకపోవడంతో మళ్లీ కోహ్లీనే కెప్టెన్ అవుతాడని ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టులో భాగం. ఒకరకంగా ఆర్సీబీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటానికి అతనే కారణం. విరాట్ లేకుండా ఆ జట్టును ఊహించుకోవడం కష్టమే. అయితే, కెప్టెన్సీ పరంగా కోహ్లీని తప్పుబట్టలేం. అతని సారథ్యంలో 144 మ్యాచ్‌ల్లో 68 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించగా.. 72 ఓటములు పొందింది. మరో నాలుగింటి ఫలితం తేలలేదు. కారణాలు ఏవైనా జట్టును మాత్రం విజేతగా నిలుపలేకపోయాడు. ఇప్పటివరకు ఐపీఎల్ చాంపియన్‌గా నిలువని జట్లలో ఆర్సీబీ ఒకటి. 2022లో కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. దీంతో ఆర్సీబీ డు పెస్లిస్‌ను తమ సారథిగా నియమించుకుంది. అయినప్పటికీ ఆ జట్టు రాత మారలేదు. దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ డు ప్లెసిస్‌ను రిటైన్ చేసుకోలేదు. వలంలోనూ అతన్ని తిరిగి తీసుకోలేదు. కోహ్లీని భారీ ధర రూ.21 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
కోహ్లీనే చాయిస్
కెప్టెన్‌ను వెతకడానికి ఆర్సీబీకి వేలం మంచి అవకాశంగా ఉండేది. కానీ, ఫ్రాంచైజీ కెప్టెన్ సామర్థ్యం ఉన్న ప్లేయర్లను తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లలో ఒకరిని కొనుగోలు చేస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. ఫ్రాంచైజీ వారిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. భువనేశ్వర్, ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా, దేవదత్ పడిక్కల్‌ను తీసుకున్నా.. వారికి పగ్గాలు అప్పగించే అవకాశం లేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, ఆర్సీబీకి కెప్టెన్సీ చాయిస్ కోహ్లీనే అని చెబుతున్నారు. కోహ్లీకి తిరిగి పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ముందే నిర్ణయించుకున్నట్టు కూడ వార్తలు వస్తున్నాయి. అందుకే, వేలంలో కెప్టెన్సీ గురించి వెతకలేదని ఆ వార్తల సారాంశం. ఫ్రాంచైజీ వ్యూహాలను పరిశీలించినా జట్టు బలం పెంచుకోవాలనే ప్రయత్నాలు తప్పించి కెప్టెన్ కోసం జరగలేదు.