నేను ఏడవడం లేదు... వణికిపోవడం లేదు: పోలీసుల నోటీసులపై స్పందించిన ఆర్జీవీ

by srinivas |   ( Updated:2024-11-26 18:02:12.0  )
నేను ఏడవడం లేదు... వణికిపోవడం లేదు: పోలీసుల నోటీసులపై స్పందించిన ఆర్జీవీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Directer Ram Gopal Varma) తీసిన ‘వ్యూహం’ సినిమా('Vyuham' movie) వివాదం అయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu), జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Janasena leader Pawan Kalyan)లపై అనుచితంగా సీన్లు తీయడమే కాకుండా సినిమాపై ప్రశ్నించిన వారిపై వ్యంగ్యంగా మాట్లాడారు. అటు సోషల్ మీడియాలోనూ అసభ్యంగా, అవమానకరంగానూ పోస్టులు పెట్టారు. దీంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో టీడీపీ (TDP) నేతల చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆర్జీవీని కలిసి నోటీసులు అందజేశారు. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే నోటీసులపై ఆర్జీవీ తాజాగా స్పందించారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదని, తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ తెలిపారు. ‘‘ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నా. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నా‘‘ అని ఆర్జీవీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed