ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలే: మంత్రి కోమటిరెడ్డి

by Mahesh |
ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలే: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ తెలంగాణ బ్యూరో: రైతులకు లాభదాయకమైన నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు బ్యూరోక్రట్లపై కూడా దాడులకు పాల్పడుతున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు హుందాగా మసలుకోవాలని హితబోధ చేశారు. సచివాలయంలో మంగళవారం జాతీయ రహదారుల పురోగతిపై సమీక్షించారు. వచ్చే వారం నుంచి పనులు జరుగుతున్న రోడ్లను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. మంచిర్యాల నుంచి ఖమ్మం జిల్లా వరకు వ్యాపించిన ఎన్.హెచ్-163 జీ నాగ్ పూర్-విజయవాడ కారిడార్ లో భాగంగా భూసేకరణ కోసం డ్రాఫ్ట్ అవార్డ్స్ 1023 కేసులు జాతీయ రహదారుల సంస్ధ వద్ద పెండింగ్ లో ఉండటంపై మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్ – మన్నెగూడ ఎన్.హెచ్-163 హైదరాబాద్ – మన్నెగూడ సెక్షన్ పనుల అగ్రిమెంట్ జరిగి మూడేండ్లు అవుతుందని కానీ పనుల పురోగతి ఎక్కడని అధికారులను మంత్రి నిలదీశారు.

జనవరి కల్లా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, చౌటుప్పల్) టెండర్లు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (158.64 కి.మీ) సాధ్యమైనంత త్వరగా డీపీఆర్ పూర్తి చేసి డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో టెండర్లు పిలిచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ – శ్రీశైలం (ఎన్.హెచ్-765)సమస్యలను కూడా సీఎంతో కలిసి మాట్లాడి అలైన్మెంట్ ను పరిశీలించి చర్చించి ఆమోదం తెలుపుతామని తెలిపారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (ఎన్.హెచ్-765) రాష్ట్రానికి అత్యంత ఉపయుక్తమైన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి కేవలం రెండు – మూడు గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు. గౌరెల్లి – వలిగొండ (ఎన్.హెచ్-930పీ) పూర్తయితే భద్రాచలానికి 7 గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు. ఖమ్మం- దేవరాపల్లి (ఎన్.హెచ్-365 బిజీ) రోడ్డు ప్రధాన రహదారితో పాటుగా సర్వీసు రోడ్లను కూడా నిర్మించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్ర జాతీయ రహదారులైన.. ఖమ్మం-కురవి ఎన్.హెచ్-365ఏ ,. నెహ్రూ నగర్ టు కొత్తగూడెం ఎన్.హెచ్ 930 పీ, డీపీఆర్ ను ఆమోదించిన మీదట వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సిరోంచ – ఆత్మకూర్ ఎన్.హెచ్-353సీ పూర్వ నిర్మాణ పనులు పూర్తయినందున వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. 2024-25 వార్షిక ప్రణాళికలో పేర్కొన్న 13 రోడ్లకు సంబంధించి డీపీఆర్ ఫైనల్ కన్సల్టెంట్లను ఫైనల్ చేసి డిసెంబర్ 20వ తేదీ కల్లా ఖరారు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 20 తేదీకల్లా డీపీఆర్ కన్సల్టెంట్లను ఖరారు చేస్తేనే దాదాపు 2117 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. వరంగల్ జిల్లాలో నిర్మించతలపెట్టిన మామునూరు ఎయిర్ పోర్ట్ ను ఆమోదిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం తెలపడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమీక్ష లో ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రెటరీ, ఆర్ఆర్ఆర్ పీడీ దాసరి హరిచందన, మోర్త్ ఆర్ఓ కృష్ణప్రసాద్, ఎన్.హెచ్.ఏ.ఐ. ఆర్ శివశంకర్, ఈఎన్సీ మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు.

రాజ్యాంగం దినోత్సవం..

రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ప్రతిపక్షాలు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. సచివాలయంలో 75వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్ అండ్ బీ, మోర్త్, ఎన్.హెచ్,ఏ.ఐ అధికారులతో కలిసి ప్రియంబుల్ ను పఠనం. చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమానమైన హక్కుల కల్పించడంలో మన రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి ఇటీవల కాలంలో కొందరు ప్రతిపక్ష పార్టీలు, నాయకులు అధికారులు, నాయకులపై దాడులకు తెగబడుతూ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన తప్పుపట్టారు. అందరూ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed