Champions Trophy 2025 : BCCIతో కాంట్రవర్సీ.. పీసీబీకి ఐసీసీ బంపర్ ఆఫర్

by Sathputhe Rajesh |   ( Updated:2024-11-26 13:12:51.0  )
Champions Trophy 2025 : BCCIతో కాంట్రవర్సీ.. పీసీబీకి ఐసీసీ బంపర్ ఆఫర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంలో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఐసీసీ రంగంలోకి దిగి పీసీబీని హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పించేలా చర్చలు సాగించింది. తాజాగా భారత్ ఆడే మ్యాచ్‌లకు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తే నజరానా మరింత పెంచనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్‌లో పర్యటించేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు పాకిస్తాన్ ససేమిరా అనడంతో ఐసీసీ అదనపు ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లకు యూఏఈని వేదికగా అంగీకరించాలని కోరినట్లు సమాచారం. భారత్ ఈ టోర్నీలో ఫైనల్‌కు క్వాలిఫై అయితే తుది పోరుకు సైతం దుబాయ్‌ను వేదికగా అంగీకరించాలని ఐసీసీ పీసీబీకి ప్రతిపాదించినట్లు తెలిసింది. పాకిస్తాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినా భారత్-పాక్‌ల మధ్య గ్రూప్ మ్యాచ్‌లు, క్వాలిఫై అయితే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను లాహోర్‌లోనే నిర్వహించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed