- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGPSC Group-2: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్టంలో గ్రూప్-2(Group-2) పరీక్షలను టీజీపీఎస్సీ(TGPSC) డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక అదే టైంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు(RRB) జూనియర్ ఇంజినీర్(JE) పరీక్షను కండక్ట్ చేస్తోంది. కాగా గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో కొంత మంది రైల్వే పరీక్షకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒకే రోజు రెండు మెయిన్ ఎగ్జామ్స్ ఉండటంతో ఏ పరీక్ష రాయలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ రెండు పరీక్షల్లో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని అటు కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థులు కోరారు.
ఇదిలా ఉంటే.. గ్రూప్-2 పరీక్షలపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరిగే గ్రూప్-2 ఎగ్జామ్స్ షెడ్యూల్(Shedule)లో ఎలాంటి చేంజెస్(Changes) చేయబోమని అధికారులు సృష్టం చేశారు. పరీక్షలను యధావిధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 16న జరిగే ఆర్‌ఆర్‌బీ పరీక్షకు రాష్ట్రం నుంచి డిప్లొమా(Diploma), ఐటీఐ(ITI) అర్హత ఉన్న 6,300 మంది మాత్రమే రాస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వెల్లడించారు. గ్రూప్2 పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను 2024 డిసెంబర్ 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.