- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్థరాత్రి ఆకలేస్తే.. వాటికి బదులు వీటిని తినండి!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామంది అర్థరాత్రిళ్లు ఏవి పడితే అవి తింటుంటారు. అర్థరాత్రి వేళలో ఆహారం తినడం శరీరానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. డిన్నర్ తర్వాత ఆకలిగా అనిపించి ఏదో ఒకటి తినాలనే ఆశ కొందరికి కలుగుతుంది. దీంతో, ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, బిర్యానీలు లాంటివి లాంగించేస్తుంటారు. వీటిని అస్సలు తినకూడదు. వీటిని అర్థరాత్రిళ్లు ఎక్కువగా తినడం వల్ల ఒబేసిటీ, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మిడ్‌నైట్ టైమ్‌లో ఆహారం తినడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు.
సాధారణంగా అర్థరాత్రిళ్లు ఎక్కువగా తినడం వల్ల ఆహారం జీర్ణం కాక శరీర బరువు పెరిగి, ఊబకాయానికి దారితీస్తుంది. రాత్రి వేళ ఆహారం తీసుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా మసాలా, జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులో ఆహారం జీర్ణమవక ఇబ్బందులు కలుగుతాయి. మిడ్‌నైట్ ఆహారపు అలవాట్లు మెటబాలిక్ సిండ్రోమ్‌ను ప్రేరేపిస్తుంది. అందుకే రాత్రిళ్లు ఆకలిగా అనిపించినప్పుడు కడుపుకు తేలికగా ఉండే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. ఇవి జీర్ణక్రియకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఆకలిని తీరుస్తాయి. అవేంటో ఇక్కడ చదివేయండి.
సలాడ్: రాత్రివేళలో ఆకలిగా అనిపించినప్పుడు కూరగాయల సలాడ్ తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కూరగాయల్లో ఫైబర్ ఎక్కవగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలుగవు. శరీరానికి పోషణ అందుతుంది.
పండ్లు: రాత్రి వేళలో ఆకలి వేస్తే, అరటి, యాపిల్ వంటి పండ్లు తినాలి. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
నట్స్: బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటివి ఆకలిగా అనిపించినప్పుడు తీసుకోవచ్చు. నట్స్‌లో ప్రొటీన్లు, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, మినరల్స్ వంటివి ఎక్కవగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పాలు: అర్థరాత్రిళ్లు ఆకలిగా అనిపించినప్పుడు పాలు తాగడం మంచిది. చక్కెర లేకుండా పాలు తీసుకోవాలి. ఇలా తాగలేని వారు అందులో బెల్లం లేదా తేనెను కలుపుకుని తాగితే కడుపు నిండుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.