Minister Ponnam : తహశీల్ధార్ కార్యాలయంలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-08 10:43:02.0  )
Minister Ponnam : తహశీల్ధార్ కార్యాలయంలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్Minister Ponnam Prahaker) హైదరాబాద్ లోని షేక్ పేట్ తహశీల్ధార్ కార్యాలయం(Sheikhpet Tahsildar Office)లో ఆకస్మిక తనిఖీ(Suden Inspection)చేశారు. సిబ్బంది హాజరు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ దరఖాస్తులను పరిశీలించారు. ప్రజా పాలన దరఖాస్తులు, ఆన్ లైన్ లో సాంకేతిక సమస్యలపై ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న రికార్డులు క్లియర్ చేయాలని సూచించారు.

ఇన్ వార్డు, ఔట్ వార్డు రిజిస్టర్ సరిగా లేదని మంత్రి పొన్నం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. బీపీఎల్ కింద ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అందించేలా అధికారులు శ్రద్ద వహించాలని సూచించారు. రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మంత్రి పొన్నం గోల్కొండలోని మైనార్టీ గురుకుల పాఠశాల బాలుర హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి..భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed