‘మాతృభాషలో మాట్లాడని వారికి ఓటు వేయొద్దు’.. మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘మాతృభాషలో మాట్లాడని వారికి ఓటు వేయొద్దు’.. మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నేడు(బుధవారం) ప్రపంచ తెలుగు మహాసభలు (World telugu conference) ప్రారంభమయ్యాయి. రాజానగరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (Godavari Global University) వేదికగా రెండు రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మహా సభల ప్రారంభోత్సవానికి ఈ రోజు మాజీ ఉపరాష్ట్రపతి(Former Vice President) వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమ్మ భాషను మరిస్తే అమ్మను మరిచినట్లేనన్నారు.

తెలుగులో మాట్లాడని వారు.. తెలుగు నాయకుడు కాదన్నారు. అలాగే తెలుగు భాష రాని నాయకులను.. బూతులు మాట్లాడే వారిని ఇంటికి సాగనంపాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో మాతృభాషలో మాట్లాడని వారికి ‘ఓటు వేయొద్దు’ అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు తెలుగు నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొందరు తెలుగు వారు అమ్మ భాష మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మాతృభాష వాడకం పెరగాలి. ఇక సినిమాల్లో మాటలు, పాటల్లో తెలుగుదనం ఉట్టిపడాలి. అమ్మ భాష కోసం పత్రికలు, ప్రసార మాధ్యమాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. మన మాతృభాషను మనమే కాపాడుకోవాలి. ‘‘భాషను ప్రేమించు.. ప్రోత్సహించు ఇతరులతో పలికించు’’ నినాదంతో ముందుకెళ్లాలి అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed