AP News : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

by M.Rajitha |
AP News : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల మరణాలు నిత్యకృత్యం అయ్యాయి. తాజాగా శ్రీచైతన్య కాలేజీ(Sri Chaithanya College)లో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఏపీ(AP)లోని కృష్ణా జిల్లాలోని తాడిగడప(Tadigadapa)లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని అనుమానస్పదంగా మరణించింది. అనారోగ్యంతో చనిపోయిందని పేరెంట్స్ కు సమాచారం ఇవ్వగా.. ఆ వార్త విన్న విద్యార్థిని తండ్రి గుండె పోటుతో కుప్పకూలరు. హుటాహుటిన ఆయనని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. స్టూడెంట్ మృతికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని కోరుతూ నిరసన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులకు, మృతి చెందిన స్టూడెంట్ బంధువులకు నచ్చజేప్పేందుకు ప్రయత్నం చేశారు.

Advertisement

Next Story

Most Viewed