ఉరివేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

by Sridhar Babu |
ఉరివేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాధ మనోహర్ (25) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహర్ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ కొంపల్లిలో నివాసముంటున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మనోహర్ మృతితో ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలో విషాదం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed