- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని వ్యవస్థలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుంది.. మాజీ ఎమ్మెల్యే
దిశ, అందోల్ : న్యాయం కోసం కొర్టులను ఆశ్రయిస్తే.. అక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదని.. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని పరిపాలనను సాగిస్తుందని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ వ్యాఖ్యాలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జోగిపేటలో మౌన ప్రదర్శన ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు నిరసనగా ఈ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని, మా బాధలను, కష్టాలను చెప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని, ప్రజా హక్కులను కాపాడుతామని, ప్రజలకు అనుగుణంగా ప్రజాపాలనను కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటను తప్పారని ఆయన విమర్శించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని ప్రశ్నించినందుకు అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. అందోలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తల పై అక్రమంగా కేసులు చేశారని ఆయన ఆరోపించారు. రైతు బంధు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ప్రస్తుతం రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం మాట తప్పడం కాదా ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేరవేర్చాలని ప్రజల తరపున ప్రశ్నించినందుకు కేటీఆర్ పై అక్రమంగా కేసునమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కేటీఆర్ పై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పీ.జైపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ.నాగభూషణం, మాజీ జడ్పీటీసీ రమేష్, మాజీ ఎంపీపీ బాలయ్య, సీనియర్ నాయకులు లింగాగౌడ్, వీరప్ప, బీర్ల శంకర్, వెంకటేశం, సటికె రాజు, మధు, సార శ్రీధర్, గోపాల్, శంకర్ పంతులు, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.