- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాముడి భూములు కబ్జాల చెర వీడేనా..?
దిశ, మేడ్చల్ బ్యూరో : దేవరయాంజల్ రామచంద్ర స్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖవేనని కమిటీ నిగ్గు తేల్చి రెండేళ్లు దాటింది. ఈ భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చాలని నిర్ణయించిన గత బీఆర్ఎస్ సర్కార్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. రఘునందన్ రావు నేతృత్వంలో 2021, మే నెలలో ఉన్నత స్థాయి త్రి సభ్య కమిటీని నియమించింది.
దేవరయాంజల్ లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ భూముల్లో వాణిజ్య నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, పరిశ్రమలు పుట్టుకొచ్చాయని, కొంతమంది సాగు కూడా చేసుకుంటున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో 2022, నవంబర్ లో నివేదిక ఇచ్చిన త్రి సభ్య కమిటీ 1,350 ఎకరాలు దేవాదాయ శాఖకే చెందుతాయని కమిటీ తేల్చింది.
పేరు మార్చి..
మేడ్చల్ జిల్లా, తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ లో పురాతనమైన శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం ఉంది. నిజాం హయాంలో ఓ భక్తుడు ఆలయానికి 1,531 ఎకరాల భూమిని వితరణ చేశారు. దానిని ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటి వరకు కచ్చితమైన భూ రికార్డులుగా చెప్పుకునే 1924-25 రెవెన్యూ రికార్డుల్లో ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్ర స్వామి ఆలయం పేరిటే ఉంది.
ఈ భూములన్నీ 55 నుంచి 63,639-641,656,657,660-682,686-718,736 సర్వే నెంబర్లలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ తర్వాత ఆ భూమి కబ్జాల పాలైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామ రెడ్డి, సీతారామారావు, సీతారామయ్య, సీతరాములుగా మారిపోయి కబ్జాదారుల పేర్లు రికార్డులెక్కాయి. ఆ భూముల్లో రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, గోదాంలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి.
ఆలయా భూముల్లో అక్రమార్జన..
త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం 1,350 ఎకరాల భూములన్నీ దేవుడి మాన్యమేనని తేలినా..మరి వాటి రూపంలో రావాల్సిన ఆదాయం ఎటు పోతుంది..? ఎవరి చేబుల్లోకి వెళుతుందో.. అధికార యంత్రానికే తెలియాలి. ప్రస్తుతం ఆ భూముల్లో 130 ఎకరాలు హకీంపేట ఎయిర్ బేస్ ఆధీనంలో ఉండగా, మరో 800 ఎకరాల భూమి వ్యవసాయం పేరుతో ఖాళీగా ఉంది. కానీ ఈ దేవాలయ భూములను కబ్జా చేసిన పలువురు నేతలు పెద్ద ఎత్తున గోదాంలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, రిసార్ట్ లు, ఫంక్షన్ హాళ్లను నిర్మించుకున్నారు. ప్రతి నెలా రూ.5 కోట్ల మేర అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వీరితో అధికారులు కుమ్మెక్కై నెలవారి మామూళ్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది చెరువులను చెరబట్టి రిసార్ట్ లు, ఫంక్షన్ హాళ్లను నిర్మించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ భూముల కబ్జాలపై నిజనిర్దారణ కమిటీ వేసిన సందర్భంలో ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎంపీగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దేవరయాంజల్ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసిన విషయం విధితమే. అయితే ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా రూ. వేల కోట్ల విలువైన 1,350 ఎకరాల భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ఈ భూముల్లో తిష్టవేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.