Delhi: కేంద్రమంత్రిని కలిసిన పవన్.. ఏఐఐబీ రుణంపై కీలక విజ్ఞప్తి

by srinivas |   ( Updated:2024-11-26 13:17:46.0  )
Delhi: కేంద్రమంత్రిని కలిసిన పవన్.. ఏఐఐబీ రుణంపై కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman)ను కలిశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ రుణం(AIIB loan)లో వెసులుబాట్లు కల్పించాలని ఆమెను కోరారు. ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ కోసం ఏఐఐబీ నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్ట్‌లో మార్పులు కోరారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 2024 డిసెంబర్ 31 వరకు ఇచ్చిన ప్రస్తుత గడువు సరిపోదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్‌ పద్ధితిలో కాకుండా ముందస్తు చెల్లింపు విధానం కొనసాగించాలని కోరారు. డిసెంబర్ 2026 వరకు ప్రాజెక్ట్ పొడిగింపు ఇవ్వాలని, నిధుల చెల్లింపుల విధానంలో మార్పులు చేయాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed