Black Friday Sale: ఫ్లిప్​కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ ఫోన్ పై ఏకంగా 60 శాతం డిస్కౌంట్..!

by Maddikunta Saikiran |
Black Friday Sale: ఫ్లిప్​కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ ఫోన్ పై ఏకంగా 60 శాతం డిస్కౌంట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్(Flipkart) ఇటీవలే బ్లాక్ ఫ్రైడే సేల్(Black Friday Sale) పేరుతో స్పెషల్ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 24న ఈ సేల్ ప్రారంభామై 29 వరకు కొనసాగనుంది. అయితే ఇందులో భాగంగా వివిధ రకాల మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ పై ఫ్లిప్​కార్ట్ ​భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇవే కాకుండా సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం అదనపు తగ్గింపును(Extra Discount) కూడా అందిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సేల్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ(Samsung Galaxy S23 FE) మొబైల్ పై 60 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.84,999 కాగా.. ఫ్లిప్​కార్ట్ లో 8జీబీ +256జీబీ వేరియంట్ మొబైల్ ను రూ. 33,999కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్​కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు(Flipkart Axis Bank Credit Card) ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేస్తే 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్(Unlimited Cashback) కూడా పొందవచ్చు. ఇదే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి .

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్..

  • 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే
  • ఎక్సీనొస్ 2200 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది.
  • 8జీబీ ర్యామ్ + 128 జీబీ రోమ్, 8జీబీ ర్యామ్ +256జీబీ రోమ్
  • 120Hz రిఫ్రెష్ రేట్(120Hz Refresh Rate)
  • ఆండ్రాయడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేస్తుంది.
  • బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ వైడ్ ప్రైమరీ కెమెరా,12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా సెటప్ తో వస్తోంది .
  • సెల్ఫీల కోసం 10 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
  • 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
Advertisement

Next Story

Most Viewed