తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల

by Mahesh |   ( Updated:2024-10-30 13:15:43.0  )
తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇటీవల గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ పోస్టుల భర్తికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను TGPSC (TSPSC) ఈ రోజు విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగునుంది. కాగా పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది TGPSC అవకాశం కల్పించింది. ఈ Group-3పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ(TGPSC) వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే 1,388 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed