- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Train tragedy: ఒడిశా రైలు దుర్ఘటన కేసు.. ముగ్గురు నిందితులకు బెయిల్
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా(Balasore distric)లో గతేడాది జరిగిన రైలు ప్రమాదం(Train accident)లో 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒడిశా హైకోర్టు(Odisha High court) తాజాగా బెయిల్ మంజూరు చేసింది. మొహమ్మద్ అమీర్ ఖాన్(Mohammad ameer khan), అరుణ్ కుమార్ మహంత(Arunkumar mahantha), పప్పు యాదవ్(Pappu yadav)లకు కోర్టు ఒక్కొక్కరికి రూ.50,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. దుర్ఘటన జరిగిన డివిజన్‌లోని ప్రధాన కార్యాలయానికి వారిని కేటాయించొద్దని రైల్వే అధికారులను ఆదేశించింది. అంతేగాక మరో ఆరు అదనపు షరతులను కోర్టు విధించింది. ఈ ముగ్గురు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయని ఆరోపణలున్నాయి. దీంతో ఘటన అనంతరం గతేడాది జూలై 7న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Cbi) వారిని అరెస్టు చేసింది. అప్పటి నుంచి వారు జైలులోనే ఉండగా తాజాగా వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, షాలిమార్-చెన్నయ్ సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, మరో గూడ్స్ రైలు గతేడాది జూన్ 2వ తేదీన బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 296 మంది మరణించగా, ,1200 మందికి పైగా గాయపడ్డారు.