బంగ్లా టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న శాంటో.. తర్వాతి కెప్టెన్ అతనేనా?

by Harish |
బంగ్లా టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న శాంటో.. తర్వాతి కెప్టెన్ అతనేనా?
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ హుస్సేన్ శాంటో తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) గురువారం ధ్రువీకరించింది. అయితే, శాంటో వన్డే, టెస్టుల్లో జట్టును సారథిగా కొనసాగనున్నాడు. కొత్త టీ20 కెప్టెన్‌ను బీసీబీ ఇంకా ప్రకటించలేదు. ‘టీ20 కెప్టెన్‌గా కొనసాగనని శాంటో మాకు చెప్పాడు. అతని నిర్ణయాన్ని మేము అంగీకరించాం. మాకు ఇప్పట్లో టీ20లు లేవు. కాబట్టి, కొత్త కెప్టెన్ గురించి మేము ఇప్పుడు ఆలోచించడం లేదు.’ అని బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ తెలిపాడు. టీ20 కెప్టెన్సీ రేసులో లిటాన్ దాస్ ముందున్నాడు. శాంటో గైర్హాజరులో ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌‌గా లిటాన్ ఆకట్టుకున్నాడు. అతని నేతృత్వంలో బంగ్లా జట్టు 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మార్చిలో జింబాబ్వేతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ సిరీస్ నాటికి బీసీబీ కొత్త కెప్టెన్‌ను నియమించే అవకాశం ఉంది.


Advertisement

Next Story

Most Viewed