- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పదేళ్ల తర్వాత తొలి బోర్డు మీటింగ్.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్ఎండీఏ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రోరైలు ప్రాజెక్టు వంటి సంస్థలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేండ్ల కాలంలో జలమండలి బోర్డు సమావేశాన్ని తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఇదే తరహాలో సీఎం చైర్మన్‌గా ఉన్న హెచ్ఎండీఏ ఆథారిటీ సమావేశాన్ని త్వరలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ అథారిటీలో చైర్మన్‌గా సీఎం, వైస్ చైర్మన్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కన్వీనర్‌గా హెచ్ఎండీఏ కమిషనర్ ఉంటారు.
సభ్యులుగా జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, పరిశ్రమల శాఖ, ఆర్ అండ్ బీ శాఖ, అటవీశాఖ, పంచాయతీ రాజ్, హోంశాఖ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శులు ఉన్నారు. వీరితోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్, ట్రాన్స్ కో, ఆర్టీసీ, టీజీఐఐసీ ఎండీలు, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, బీఎస్ఎన్ఎల్ సీజీఎం, హెచ్ఎండీఏ ప్లానింగ్ కమిటీ నుంచి ఒకరు సభ్యులు కూడా వ్యవహరించనున్నారు. దీంతోపాటు హెచ్ఎండీఏ కమిషనర్ చైర్మెన్ గా ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. దీంతోపాటు హైదరాబాద్ లో ట్రాఫిక్, ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేసిన యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ ఆథారిటీ(ఉమ్టా) సమావేశం కూడా జరగడంలేదు. దీన్ని కూడా రెగ్యులర్ గా నిర్వహించాలని ప్రభుత్వం సూచించినట్టు సమాచారం.
హైడ్రా గవర్నింగ్ బాడీ..
సీఎం చైర్మన్‌గా హైడ్రా గవర్నింగ్ బాడీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి హైడ్రా కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహించనున్నారు. సభ్యులుగా పట్టణాభివృద్దిశాఖ, రెవెన్యూ శాఖ మంత్రులు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ఇన్ చార్జి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జీహెచ్ఎంసీ మేయర్, పురపాలక శాఖ. పట్టణాభివృద్దిశాఖ, రెవెన్యూశాఖ,హోంశాఖ ముఖ్యకార్యదర్శులు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ ఉన్నారు. హైడ్రా గవర్నింగ్ బాడీ సమావేశాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
సీఎస్ చైర్ పర్సన్ గా మెట్రోరైలు బోర్డు
హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్), హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్)లకు ప్రత్యేకంగా బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు బోర్డులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బోర్డులో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, ఆర్ అండ్ బీ శాఖ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శులు, డీజీపీ, హెచ్ఎండీఏ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్ ఎండీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ బోర్డుల సమావేశాలను సైతం నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని సమాచారం.