Ram Charan – Naharika : అన్నతో పోటీకి సిద్ధమవుతున్న నిహారిక

by Prasanna |
Ram Charan – Naharika : అన్నతో పోటీకి సిద్ధమవుతున్న నిహారిక
X

దిశ, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ ( Ram Charan) హీరోగా " గేమ్ ఛేంజర్ " ( Game Changer) సినిమా సంక్రాంతికి వస్తున్న విషయం మనకీ తెలిసిందే. జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ మూవీతో పాటు స్టార్ హీరోల సినిమాలు కూడా ఇదే సమయంలో రిలీజ్ అవుతున్నాయి. బాలకృష్ణ హీరోగా " డాకు మహారాజ్ ", వెంకటేష్ హీరోగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళ్ లో అజిత్ మూవీ పోటీ విడుదలవుతుందనుకున్నారు.. కానీ, లాస్ట్ మినిట్ లో అజిత్ మూవీ వాయిదా వేశారు.

తమిళ్ లో అజిత్ సినిమా వాయిదా పడటంతో చిన్న సినిమాలు సంక్రాంతి బరిలో దిగుబోతున్నాయి. ఈ క్రమంలోనే నిహారిక కథానాయికగా నటించిన తమిళ సినిమా " మద్రాస్ కారన్ " ( Madraskaaran) సినిమా కూడా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. షాన్ నిగమ్, కలైరాసన్ హీరోలుగా నిహారిక కొణిదెల (Niharika), ఐశ్వర్య దుత్త హీరోయిన్స్ గా ఈ ‘మద్రాస్ కారన్’ మూవీ వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. రామ్ చరణ్ సినిమా కూడా ఇదే రోజున రిలీజ్ అవుతుండటంతో నిహారిక " మద్రాస్ కారన్ " సినిమాతో పోటీ ఇవ్వనుంది. మరి, ఈ రెండు సినిమాల్లో అన్న సినిమా మెచ్చుతారో లేక చెల్లి సినిమాకి ఓటేస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed