PM Modi: ఏఐ-ఫస్ట్‌గా భారత్.. ప్రధాని మోడీతో భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల

by S Gopi |
PM Modi: ఏఐ-ఫస్ట్‌గా భారత్.. ప్రధాని మోడీతో భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడుల ప్రణాళికలపై కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం సత్య నాదెళ్లతో భేటీ కావడంపై ప్రధాని మోడీ స్పందించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంశాలపై చర్చించినట్టు చెప్పారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రధాని మోడీ.. సత్య నాదేళ్లను కలవడం ఆనందంగా ఉంది. దేశంలో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా కొత్త టెక్నాలజీ, ఏఐ గురించి చర్చించడం బాగుందని పోస్ట్ చేశారు. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన సత్య నాదేళ్ల ప్రధాని మోడీతో భేటీ అనంతరం.. దేశంలో ఏఐ విస్తరణ కోసం భారత్‌తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా మార్చేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరు దాని ప్రయోజనాలను పొందడానికి అవసరమైన సేవలను విస్తరించనునట్టు పేర్కొన్నారు. కాగా, సత్య నాదెళ్ల తన పర్యటనలో భాగంగా బెంగళూరు, ఢిల్లీల్లోని మైక్రోసాఫ్ట్‌ క్లయింట్లు, ఇతర భాగస్వాములతో మాట్లాడనున్నారు.

Advertisement

Next Story

Most Viewed