- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోర్టు నియమించిన ప్యానెల్‌తో చర్చలకు రైతులు రెడీ.. సుప్రీం కోర్టుకు తెలిపిన పంజాబ్ ప్రభుత్వం
దిశ, నేషనల్ బ్యూరో : కోర్టు నియమించిన ప్యానెల్‌తో చర్చలకు రైతులు అంగీకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సోమవారం తెలిపింది. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ పంజాబ్ ప్రభుత్వం తరఫున జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు దల్లేవాల్‌ను ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను పాటించడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణను బెంచ్ జనవరి 10కి వాయిదా వేసింది. కోర్టు నియమించిన ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నవాబ్ సింగ్‌ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిరసనకారులు కలిసేలా ఒప్పించినట్లు కపిల్ సిబల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ప్యానెల్‌ను కలిసేందుకు గతంలో రైతులు నిరాకరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని విచారణను వాయిదా వేయాలన్న సిబల్ అభ్యర్థనను కోర్టు అనుమతించి తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.