- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బతుకమ్మకుంట పై హైడ్రాకు అనుకూలంగా తీర్పు
దిశ, తెలంగాణ బ్యూరో : అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. బతుకమ్మ కుంట స్థలం తమదంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద 3 దశాబ్దాలుగా తనదిగా చెబుతున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డికి హైకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమమేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు హైడ్రాను సంప్రదించడమే కాకుండా, సంబంధిత పత్రాలను కూడా అందజేసిన విషయం విధితమే. చెరువుల పునరుద్ధరణలో భాగంగా నవంబర్ 13న అబర్పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ సందర్శించారు.
అదే రోజు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు ప్రారంభించిన విషయం విధితమే. హైడ్రా చర్యలపై ఎడ్ల సుధాకర్‌రెడ్డి 14 నవంబర్ 24న కోర్టును ఆశ్రయించగా హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, సంబంధిత శాఖ అధికారులు సర్వే నెం.563/1లో ఉన్న భూ రికార్డులను పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలుచేయగా న్యాయమూర్తి జస్టిస్ సీవీ.భాస్కరరెడ్డి పిటిషనర్ అయిన ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఈ భూమిపై ఎలాంటి హక్కులేదని తీర్పుచెప్పారు. అది బతుకమ్మ కుంటగానే నిర్ధారించారు. బతుకమ్మకుంటపై 2017 సంవత్సరంలో హైకోర్టు డబుల్ బెంచ్ చెరువుగానే తీర్పును వెలువరించింది. ఫిర్యాదుదారుడికి ఏమైనా హక్కుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టు తీర్పుపట్ల హైడ్రా కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరఫున సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి.. అనుకూలమైన తీర్పు రావడంలో కృషిచేసిన హైడ్రా లీగల్ బృందంతో పాటు, రెవెన్యూ ఉద్యోగులను మంగళవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సన్మానించారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కే.రవీందర్‌రెడ్డి, సీహెచ్.జయకృష్ణ, హైడ్రా న్యాయ సలహాదారుడు శ్రీనివాస్, హైడ్రా లీగల్ విభాగం లైజినింగ్ అధికారి డీ.మోహన్, హైడ్రా డిప్యూటీ కలెక్టర్ ఎల్.సుధ, తహసిల్దార్ ఎం.హేమమాలిని, తహసీల్దార్ పీ.విజయ్ కుమార్, అంబర్‌పేట తహసీల్దార్ బీ.వీరబాయి, సర్వేయర్ కిరణ్‌లతో పాటు పలువురు అధికారులను అభినందించి, శాలువతో సన్మానించారు.
బతుకమ్మ కుంటకు పూర్వవైభవం..
బతుకమ్మ కుంటకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుంది. 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఉంది. ఈ విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టనుంది. బతుకమ్మ కుంటలో నీటితో కళకళలాడితే పరిసర ప్రాంతల్లో పర్యావరణం, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కమిషనర్ తెలిపారు.