- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుల కోసం హెచ్ఎండీఏ కసరత్తు
దిశ, తెలంగాణ బ్యూరో: కాసులతో కలకలాడిన హెచ్ఎండీఏ నేడు అప్పుల కోసం ఎదురుచూస్తోంది. ప్లానింగ్ విభాగం, భూముల వేలం ద్వారా సేకరించిన నిధులను(ఖజానా) దశాబ్దకాలంలో ఖాళీ చేశారు. ఫార్ములా ఈ-కారు రేసు కోసం రూ.50 కోట్లను హెచ్ఎండీఏ నుంచి ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ఏ శాఖకు నిధులు కావాలన్నా ఇచ్చే విధంగా హెచ్ఎండీఏ ఖజానా ఉండేది. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ సైతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దాంతో అప్పులు తీసుకోవడానికి హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మీర్ ఆలం ట్యాంక్‌పై వంతెన నిర్మాణం చేపట్టాలంటే అప్పులు తీసుకోక తప్పదని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఆర్ ఎస్పీ రూపంలో టెండర్ల ఆహ్వానం
ఎస్ఆర్డీపీలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులను పూర్తి చేయడానికి గతంలో జీహెచ్ఎంసీ బాండ్లు, బ్యాంకు రుణాల ద్వారా నిధులు సేకరించిన విషయం తెలిసిందే. అదే తరహాలో హెచ్ఎండీఏ సైతం బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్థికపరమైన సలహాలు ఇవ్వడానికి నిధుల సమీకరించడానికి ‘అడ్వయిజర్ కం మర్చెంట్ బ్యాంకర్’ నియమించుకోవడానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) రూపంలో టెండర్లు ఆహ్వానించింది. టెండర్ దాఖలు చేయడానికి బుధవారం సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే గడువు ఉంది. సాంకేతికంగాను, ఆర్థికంగాను గుర్తింపు ఉన్న సంస్థను క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్(క్యూసీబీఎస్) విధానంలో ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. అయితే, అప్పులు ఎన్ని కోట్లు తీసుకోవాలి? ఏ బ్యాంకు నుంచి తీసుకోవాలి? ఎంత వడ్డీతో తీసుకోవాలి? అనే విషయాలపై సలహాలు, సూచనలు ఇవ్వడానికే ప్రత్యేకంగా ఏజెన్సీని నియమించుకోవాలని సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగానే హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది.
అప్పులు తీసుకోక తప్పదు!
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే అప్పులు తీసుకోక తప్పదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.5,106 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్లు, రూ.4,030 కోట్లతో ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు, రూ.363 కోట్లతో మీర్ ఆలం ట్యాంకుపై వంతెన నిర్మాణాలను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసినా నిధులిచ్చే పరిస్థితి లేదని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకోసం బాండ్లు, బ్యాంకు రుణాల ద్వారా అప్పులు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.