- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
31 లక్షల ఓయో రూమ్స్ బుకింగ్
దిశ, హైదరాబాద్ బ్యూరో: ఓయో రూమ్స్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా ఏర్పాటైన వీటిల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏకాంతంగా గడిపేందుకు బెస్ట్ లొకేషన్‌గా మారుతున్నాయి. డ్రగ్స్, సెక్స్ వంటి వాటికి కేంద్రాలవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీస్ శాఖ కూడా వీటిపై నిఘా పెంచింది. నగరంలోని ప్రముఖ లాడ్జీలు ఓయో యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్న పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇటీవల ముగిసిన నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓయో లాడ్జీలు పూర్తిగా యువతీ, యువకులతో నిండిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆన్‌లైన్‌లో రూమ్స్ బుక్ చేసుకుంటున్న యువత గదులలో మద్యం, మత్తుపదార్ధాలు కూడా విచ్చలవిడిగా సేవిస్తున్నారు. గదులలో ఇద్దరికి మించి మూడవ వ్యక్తిని అనుమతించకపోవడంతో వీటి పట్ల యువతీ, యువకులు ఆకర్షితులవుతున్నారు. కొంతమంది విఠులు ఇతర రాష్ట్రాల నుంచి సెక్స్ వర్కర్లను తెప్పించి వ్యభిచారం జోరుగా సాగుతున్న సంఘటనలు కూడా గతంలో పోలీసుల దాడుల సందర్భంగా వెలుగుచూశాయి.
31 లక్షల బుకింగ్స్..?
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 31.10 లక్షల ఓయో రూమ్స్‌ను బుక్ చేసుకోవడం ఈ పరిస్థితికి అద్దంపడుతోంది. వారిలో 18 నుంచి 30 ఏండ్ల లోపు యువతీ, యువకులు, పెళ్లి కాని జంటలు గదులు బుక్ చేసుకుంటున్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓయో లాడ్జీలు కేవలం పేమెంట్ పై మాత్రమే దృష్టి సారిస్తూ గదుల కేటాయింపులు అధికంగా జరుపుతుండడాన్ని అవకాశంగా తీసుకుని లవర్స్ బరితెగించి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో గదుల బుకింగ్ అధికంగా ఉంది.
లవర్స్‌కు హాట్ స్పాట్లు..
హైదరాబాద్ మహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఓయో, ఇతర లాడ్జీలు వ్యభిచార కేంద్రాలకు అడ్డాలుగా మారుతుండడాన్ని గుర్తించిన నగర పోలీసులు వీటిపై పలుమార్లు దాడులు నిర్వహించి మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. కేసులు మాకేమీ కొత్త కాదన్నట్లు కొందరు తరచు పట్టుబడుతూ ఫెనాల్టీలు కడుతూ అదే దందాను కొనసాగిస్తున్నారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సీసీ టీవీలు ఏర్పాటు చేయకపోతే తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్, ఐపీసీ 188 ప్రకారం శిక్షార్హులని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో ఓయో వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది.
నిబంధనలు కఠినతరం..
ఆన్‌లైన్ ద్వారా బుకింగ్స్ చేసుకోవడం, ప్రవేశం సమయంలో కేవలం గుర్తింపు కార్డు చూపితే అనుమతించడం వంటివి జరుగుతుండడంతో యువతీ, యువకుల శృంగారానికి అడ్డూ, అదుపు లేకుండా పోయిందనే టాక్ వచ్చింది. దీంతో ఓయో యాజమాన్యం ఇటీవల నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించింది. ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ ప్రకారం ఇకపై పెళ్లికాని జంటలకు గదులు అద్దెకు ఇవ్వరు. ఇకపై ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రూమ్స్ బుకింగ్ చేసుకునే సమయంలోనే రూల్స్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పెళ్లి చెల్లుబాటు అయ్యో రుజువును సమర్పించాల్సి ఉంటుంది. ఎలాంటి రుజువులు లేని బుకింగ్స్‌ను తిరస్కరిస్తామని ప్రకటించింది. ముందుగా ఈ నిబంధనలు మీరఠ్‌లో అమలు చేయాలని నిర్ణయించింది. గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. అయితే ఈ నిబంధనలను దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన హైదరాబాద్‌లో కూడా అమలు చేయాలని డిమాండ్లు నగరవ్యాప్తంగా వినబడుతున్నాయి. ఓయో యాజమాన్యం వీలైనంత త్వరగా గ్రేటర్ పరిధిలో నిబంధనలు కఠినతరం చేయాలని యువత మినహా ఇతర అన్ని వయస్సుల వారు అభిప్రాయపడుతున్నారు.