- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Israel: గాజాపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు.. 54 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడుతూనే ఉంది. గాజాలోని వివిధ ప్రాంతాలపై గురువారం వైమాణిక దాడులు చేసింది. శరణార్థి శిబిరాలపై విరుచుకుపడింది. ఈ ఘటనల్లో 54 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజా పోలీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ మహమూద్ సలా, అతని సహాయకుడు హుస్సామ్ షావాన్ సైతం ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. అలాగే ఖాన్ యూనిస్ (Khan Yunis) నగరంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆరుగురు, ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం, షాతి (బీచ్) శిబిరం, సెంట్రల్ గాజాలోని మాఘాజీ శిబిరంలోని వ్యక్తులు మృతి చెందినట్టు తెలిపింది. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజాలో యుద్ధం చేయడంలో అంతర్జాతీయ చట్టాన్ని అనుసరించామని, పౌర నష్టాన్ని తగ్గించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి తెలిపారు.