- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంథని నుండి విడిపోనున్న గుంజపడుగు
దిశ,మంథని : జిల్లాలో మరో నూతన మండలం ఏర్పాటు కానుంది. ఇప్పటికే కొత్త మండలం ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంథని మండలంలోని గుంజపడుగు గ్రామపంచాయతీ నూతన మండలంగా ఏర్పాటు కానుంది. 15 రెవెన్యూ గ్రామాలు నూతన మండలం లో విలీనం కానున్నాయి. గుంజపడుగు మండలం ఏర్పాటు అయితే నాగారం, అక్కేపల్లి, రచ్చపల్లి, విలోచవరం,కన్నాల,ఉప్పట్ల,అడ్యాల, బెస్తపల్లి, పోతారం, సిరిపురం, చిల్లపల్లి, దుబ్బపల్లి రెవెన్యూ గ్రామాలు మంథని మండలం నుండి విడిపోనున్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలు నూతన మండలంగా ఏర్పాటు కానున్న గుంజపడుగులో కలవనున్నాయి. అదే విధంగా రామగిరి మండలంలోని సుందిళ్ల, ముస్త్యాల, జల్లారం, ఉప్పర్ల కేసరం నాలుగు రెవెన్యూ గ్రామాలు గుంజపడుగు మండలంలో కలవనున్నాయి. మొత్తంగా 15 రెవెన్యూ గ్రామాలతో ఈ నూతన మండలం ఏర్పాటు కానుంది.
అదే విధంగా మంథని మండలంలో ఎ క్లాస్ పూర్ గ్రామపంచాయతీ నుండి మరో నూతన గ్రామ పంచాయతీగా శాస్త్రుల పల్లి,నాగేపల్లి గ్రామపంచాయతీ నుండి స్వర్ణ పల్లి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు దీనికీ సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపినట్లుగా తెలుస్తోంది. గుంజపడుగును (కాశి పట్నం) మండలంగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కొన్ని రోజులుగా గుంజపడుగు ప్రజలు టెంట్లు వేసుకొని,ధర్నా నిరసన తెలిపారు. ఎమ్మెల్యే,మంత్రులకు కూడా నూతన మండలంగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో వినతి పత్రాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మండలం ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గుంజపడుగు గ్రామస్తుల పోరాటానికి ఫలితం నెరవేరనుంది. నూతన మండలం ఏర్పాటు పట్ల గుంజపడుగు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలు పంపించాం : కె.సురేష్, మంథని ఆర్డీవో
మంథని మండలం నుండి 11 రెవెన్యూ గ్రామాలు,రామగిరి మండలం నుంచి 4 రెవెన్యూ గ్రామాలు కలిపి మొత్తం 15 రెవెన్యూ గ్రామాలతో గుంజపడుగు మండలం ఏర్పాటుకు ప్రతి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ కు పంపడం జరిగింది. మంథని మండలం నుంచి ఎ క్లాస్ పూర్ గ్రామ పంచాయతి నుండి శాస్త్రుల్లపల్లి తో పాటు నాగేపల్లి గ్రామపంచాయతీ నుండి స్వర్ణ పల్లి గ్రామాలను గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కూడా ప్రతి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ రాగానే నూతన మండలం, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.