- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇద్దరు నిషేధిత మావోయిస్టు కమిటీ సభ్యుల లొంగుబాటు
దిశ, కొత్తగూడెం రూరల్: తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట స్వచ్ఛందంగా బుధవారం లొంగిపోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. సోడి పొజ్జి, మడివి సోమిడిలు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగిందని తెలిపారు. ఈ ఇద్దరు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ దళ సభ్యులుగా చేరి ఏరియా కమిటీ సభ్యులుగా ప్రమోషన్ పొంది ఇప్పటివరకు ఒకరు చర్ల ఎల్ ఓఎస్ కమాండర్ గా మరోకరు మణుగూరు ఏరియా ఎల్ జి ఎస్ కు కమాండర్ గా పని చేసినట్లు వివరించారు. వీరి ఒక్కొక్కరిపై రూ. నాలుగు లక్షల రివార్డు ఉందన్నారు. జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం మంచి సత్ఫలితాలనిస్తుందని పేర్కొన్నారు.
జిల్లా పోలీసులకు లొంగిపోయిన వారికి అందవలసిన ప్రతిఫలాలను సత్వరమే అందించడం ద్వారా మిగిలిన మావోయిస్టు పార్టీ దళ సభ్యులు నాయకులు కూడా ఆకర్షితులై పోలీసుల ఎదుట లొంగిపోవడం జరుగుతుందని వివరించారు. ఇందులో భాగంగానే వీరిద్దరూ జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగిందని తెలిపారు. సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ స్వయంగా గానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద గానీ సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే దళసభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.