TRAI: టెలికాం కంపెనీలకు గుడ్ న్యూస్.. కొత్త నిబంధనల అమలు కోసం గడువును పొడిగించిన ట్రాయ్

by Maddikunta Saikiran |
TRAI: టెలికాం కంపెనీలకు గుడ్ న్యూస్.. కొత్త నిబంధనల అమలు కోసం గడువును పొడిగించిన ట్రాయ్
X

దిశ, వెబ్ డెస్క్: నెట్‌వర్క్ కంపెనీ(Network company)లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) గుడ్ న్యూస్ చెప్పింది. కాగా స్పామ్ కాల్స్, మెసేజ్(Spam calls, Messages)లను అరికట్టడానికి ట్రాయ్ ఇటీవలే కొత్త రూల్స్(New Rules)ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు గడువు రేపటితో ముగియనుంది. అయితే తాజాగా ఆ గడువును పొడిగించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. టెలికం ఆపరేటర్ల(Telecom Operators) విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 1 వరకు పొడిగించింది. కాగా రిజిస్టర్ చేయని టెలీమార్కెటింగ్, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి వచ్చే సందేశాలు(Messages), ఓటీపీ(OTP)లను బ్లాక్ చేయాలని టెలికామ్ సంస్థలకు ట్రాయ్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. నకిలీ కాల్స్‌ను గుర్తించేలా సిస్టమ్‌ను తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్ విషయంలో వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ ప్రకటించింది.

Next Story

Most Viewed