- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sex & Science : గర్భం దాల్చిన తర్వాత ఎన్ని నెలల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు!
నా వయసు ఇరవై అయిదేళ్లు. పెళ్లై రెండేళ్లు అయ్యింది. యోని (vagina Loose) లూజుగా ఉందంటున్నారు. వెజైనా టైట్ (Vezina tight)కావడానికి హజ్బెండ్ స్టిచ్ (Husband Stitch) చేయించుకుంటారని విన్నాను. దీనివలన ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా? గర్భం (pregnancy) దాల్చిన తర్వాత ఎన్ని నెలల వరకూ సెక్స్(sex)లో పాల్గొనవచ్చు? ఎన్ని నెలల వరకూ వ్యాయామం చేయవచ్చు? పెల్విక్ కండరాల(Pelvic muscles)ను పటిష్టపరిచే వ్యాయామాలు(Exercises) ఏ యాంగిల్లో చేయాలో చెప్పగలరు.
సంజనా! యోని లూజు అవడమంటూ ఉండదు. శృంగార సమయంలో భర్త చక్కగా ఫోర్ ప్లే(Foreplay) చేయడం వలన భార్యలో ప్రేరణ కలిగి శృంగార గ్రంథులు యోనిలోకి అధికంగా ద్రవాలను స్రవిస్తాయి. ఇద్దరూ కాటన్ క్లాత్‌తో తడిని తుడి చేసుకోవటం ఒక్కటే దీనికి మార్గం. లేదా ఫోర్ ప్లే కాలాన్ని తగ్గించాలి. హజ్బెండ్ స్టిచ్ అవసరం లేదు. ముందు ముందు ప్రసవాలు(childbirth), ఎపిసయాటమీ(Episiotomy)లతో అన్నీ స్టిచ్లు వేయించుకుంటూ శరీరాన్ని గాయపరుచుకుంటూనే ఉండాలి. అనవసరంగా ఈ సర్జరీ(Surgery)కి వెళ్లద్దు. ఇద్దరూ కలిసి సెక్సాలజిస్టు(Sexologist)ను కలవండి. అలాగే గర్భం దాల్చిన తర్వాత ఏ ఆరోగ్య సమస్య లేక పోతే తొమ్మిదో నెల చివరి 15 రోజులున్నాయన్నంత వరకూ సున్నితంగా పొత్తి కడుపుపై బరువు పడని భంగిమల్లో శృంగారం చేసుకోవచ్చు. అయితే గైనకాలజిస్ట్ (Gynecologist) సలహా తప్పనిసరి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా యాంటినేటల్ ఎక్సర్సైజులు, అలాగే కాన్పు సులభంగా కావటానికి బ్రీథింగ్+రిలాక్సేషన్ ఎక్సర్సైజు(Breathing+relaxation exercise)లు 8వ నెలవరకూ చేయవచ్చు. బ్రీథింగ్+రిలాక్సేషన్ ఎక్సర్సైజులు మాత్రం 9వ నెల కూడా చేయవచ్చు. బ్రీథింగ్ ఎక్సర్సైజులు ప్రసవం జరిగేటప్పుడు సెకెండ్ స్టేజ్ ప్రొలాంగ్ అయ్యి, శిశువు తలపై పెల్విస్ ఒత్తిడి (Pelvic pressure) పడి బుద్ధి మాంద్యంతో పుట్టకుండా ఆపుతాయి. అలాగే సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ అయితే, అదీ ఎపిసియాటమీ అనే మైనర్ సర్జరీ జరిగి ఉంటే మూడు నెలల తర్వాత నుంచి చిన్న చిన్న వ్యాయామాలు చేయవచ్చు. సిజేరియన్ అయితే మాత్రం కచ్చితంగా 6 నెలల వరకూ వ్యాయామాలు చేయకూడదు. కానీ బ్రీథింగ్ ఎక్సర్సైజులు, ఇంట్లోనే వాకింగ్, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్