- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రిన్సిపాల్ క్యాంపస్ లోకి రావద్దు..రోడ్డుపై బైఠాయించిన గురుకుల పాఠశాల విద్యార్థులు
దిశ,ఎర్రవల్లి: బీచుపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు విద్యార్థులను వేధిస్తూ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గత 15 రోజుల క్రితం బీచుపల్లి గురుకుల విద్యార్థులు పాఠశాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రోడ్డుపై పాదయాత్ర నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రిన్సిపాల్ ను తొలగించాలంటూ ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ నిజా నిజాలను తెలుసుకొనేందుకు పాఠశాలకు అధికారులను పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
దీనిలో భాగంగా గురువారం నిజ నిర్ధారణ కమిటీ పాఠశాలకు వచ్చి విద్యార్థులను, ప్రిన్సిపాల్ ను విచారించినట్లు సమాచారం.అయితే నేడు ఉదయం ప్రిన్సిపల్ క్యాంపస్ లోనే ఉండడంతో విద్యార్థులు అందరూ కలిసి విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపాల్ క్యాంపస్ లో ఉండటానికి వీల్లేదని పాఠశాల ముందు 44వ జాతీయ రహదారిపై కూర్చుని ధర్నా నిర్వహిస్తూ ప్రిన్సిపల్ క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పై అధికారులు ప్రిన్సిపాల్ ను పాఠశాలలోనే కొనసాగించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానంతో విద్యార్థులు ధర్నా కార్యక్రమానికి పూనుకోవడంతో పాఠశాల సిబ్బంది పోలీసుల సహకారంతో విద్యార్థులకు అన్ని విషయాలు క్యాంపస్ లో కూర్చొని మాట్లాడుకుందామని నచ్చచెప్పి క్యాంపస్ లోనికి తీసుకొని వెళ్లారు.