అయ్యప్ప సొసైటీలో హైడ్రా యాక్షన్ షురూ.. 5 అంతస్తుల భవనం కూల్చివేత

by srinivas |
అయ్యప్ప సొసైటీలో హైడ్రా యాక్షన్ షురూ.. 5 అంతస్తుల భవనం కూల్చివేత
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో హైడ్రా(Hydraa) యాక్షన్ మళ్లీ మొదలైంది. చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మించిన భవనాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath)ఆధ్వర్యంలో ఇప్పటికే నేటమట్టం చేసిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన ఆయన మళ్లీ రంగంలోకి దిగారు. నగరంలో అక్రమంగా నిర్వహించిన భవనాల కూల్చివేతలను ప్రారంభించారు.

తాజాగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ(Madhapur Ayyappa Society)లో హైడ్రా చర్యలు సాగుస్తున్నాయి. 658 గజాల్లో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని రంగనాథ్ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద జేసీలతో కూల్చివేస్తున్నారు. ముందుగానే నోటీసులు ఇచ్చి నేలమట్టం చేస్తున్నారు. అయ్యప్ప సొసైటీలో 100 అడుగుల రోడ్డును ఆనుకుని ఈ నిర్మాణం ఉంది. ఇప్పటికే పరిశీలంచిన రంగనాథ్ నేడు కూల్చేవేతకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని 5 అంతస్తుల భారీ భవనాన్ని కూల్చివేస్తున్నారు. దీంతో హైడ్రా చర్యలు స్థానికంగా కలకలం రేపాయి.

Advertisement

Next Story

Most Viewed