Earthquake: ఢిల్లీలో భూ ప్రకంపనలు.. తీవ్ర భయాందోళనకు గురైన జనం

by Shiva |   ( Updated:2025-01-07 02:09:49.0  )
Earthquake: ఢిల్లీలో భూ ప్రకంపనలు.. తీవ్ర భయాందోళనకు గురైన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వరుస భూకంపాలు (Earthquakes) అందరిని కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ (Delhi), ఎన్‌సీఆర్‌ (NCR)లో, అదేవిధంగా బీహార్ (Bihar) రాజధాని పాట్నా (Patna), మరికొన్ని జిల్లాలో ఉదయం 6.40కి భూమి కంపించింది. ఈ అనూహ్య పరిణామంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్-టిబెట్ (Nepal-Tibet) సరిహద్దులో లోబుచేకి (Lobuche) ఉత్తర-వాయువ్యంగా 93 కి.మీ దూరంలో సుమారు 10 కి.మీ లోతున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని గుర్తించారు. అయితే, ఆ ప్రకంపనల ప్రభావం భారత్‌ (India)లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ (Delhi), పశ్చిమ బెంగాల్ (West Bengal), బిహార్ (Bihar) సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా చైనా (Chinల), బంగ్లాదేశ్‌ (Bangladesh)లో కూడా భూకంపాలు చోటుచేసుకున్నాయి. చైనాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌‌పై 6.9గా నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed