- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Movies: ఒకే రోజు రెండు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ .. బాక్సాఫీస్ వద్ద ఏది హిట్ కొడుతుందో?
దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ( Ajith Kumar) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ( Good Ugly Bad) అనే మూవీ చేస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అజిత్ సరసన సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. అలాగే ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్ తదితర నటీ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే,ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ లో అజిత్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. కుర్చీపై కూర్చొని గన్ పట్టుకున్న స్టైల్ అదిరిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం, ఈ పోస్టర్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
ఇంకో వైపు ఇదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas) నటిస్తున్న ‘రాజా సాబ్’ ( The Raja Saab) ఆడియెన్స్ ముందుకు రానుంది. దీంతో, ఈ ఇద్దరు స్టార్ల మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద వార్ నడవనున్నట్లు తెలుస్తోంది. మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా, మాళవికా మోహన్, నిధి అగర్వాల్ కథానాయికలగా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే, రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఒకే రోజు రెండు స్టార్ హీరోల సినిమాలు విడుదల కానుండటంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ కొడుతుందో తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.