CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ప్రకటనపై బీఆర్ఎస్ పోస్టర్ అటాక్

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ప్రకటనపై బీఆర్ఎస్ పోస్టర్ అటాక్
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు ఎకరాకు రూ.7500 రైతు భరోసా(Rythu Bharosa) ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీకి బదులుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రూ.6వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన ప్రకటన(Announcement)పై బీఆర్ఎస్ పోస్టర్ అటాక్ మొదలు పెట్టింది. ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావ్ రేవంత్..మీరు 2023యాసంగి ఎకరానికి రూ.2,500లు, 2024 వానకాలం ఎకరానికి 7,500లు, యాసంగి ఎకరానికి రూ.7,500 మొత్తం రూ.17,500 కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డారంటూ రాసిన పోస్టర్లు ఊరువాడా బీఆర్ఎస్ అతికిస్తుంది.

అలాగే మరో పోస్టర్ లో రేవంత్..మీరు రైతులకు రైతు భరోసా ఒక్కో ఎకరానికి బాకీ పడ్డది...ఒక ఎకరానికి 17,500 మెుదలుకుని 7ఎకరాలకు 1లక్ష 22,550లు బాకీ అని పేర్కొన్నారు. రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారంటూ పోస్లర్ల ద్వారా బీఆర్ఎస్ ప్రచార పోరు సాగిస్తోంది. కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఊరూరా ఈ పోస్టర్ల ప్రచారం సాగిస్తు్న్నాయి. రైతు భరోసాపై బీఆర్ఎస్ సాగిస్తున్న పోస్టర్ల వార్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed