ఆవు దూడలను చంపి తిన్న చిరుత.. కనెపల్లిలో టెన్షన్ టెన్షన్...

by srinivas |
ఆవు దూడలను చంపి తిన్న చిరుత.. కనెపల్లిలో టెన్షన్ టెన్షన్...
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం కన్నెపల్లిలో చిరుత(Leopard) సంచారం కలకలం రేగింది. కన్నెపల్లి(Kannepalli) రోడ్డులో రెండు ఆవులను చిరుత చంపి తినింది. దీంతో స్థానికుల భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారుల(Forest Officers)ను సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఈ మేరకు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకునే వరకూ స్థానికులు రాత్రి సయమంలో ఒంటరిగా తిరగొద్దని సూచించారు. పగలు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రైతులు పొలాలకు వెళ్లే సమయంలో చిరుతను బెదిరించేలా కర్రలు వెంట తీసుకెళ్లాలని తెలిపారు. అయితే స్థానికులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక అటవీ ప్రాంతం నుంచి చిరుతలు తరచూ వస్తున్నాయని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed