ఉగ్రదాడిపై ప్రధాని మోడీ హైలెవెల్ మీటింగ్.. హాజరైన భద్రతా దళాల అధిపతులు

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-29 14:34:33.0  )
ఉగ్రదాడిపై ప్రధాని మోడీ హైలెవెల్ మీటింగ్.. హాజరైన భద్రతా దళాల అధిపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాని మోడీ(PM Modi) నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), త్రివిధ దళాల అధిపతులు.. సీడీఎస్ అనిల్ చౌహాన్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఉగ్రదాడి అనంతర చర్యలపై ప్రధానికి వివరిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటపైనా వివరణ ఇచ్చారు. అనంతరం దేశ అంతర్గత భద్రతతో పాటు సరిహద్దు భద్రతపైనా కీలకంగా చర్చిస్తున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని పెహల్గాం వద్ద అమయాకులను అతి కిరాతకంగా దాడి చేసిన చంపిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ(Army), సీఆర్పీఎఫ్‌(CRPF) బలగాలు జమ్మూకశ్మీర్‌ పోలీసుల సాయంతో పెహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల దగ్గర చైనా యాప్స్‌, అమెరికా గన్స్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పెహల్గాం దాడి సమయంలో వీరంతా శాటిలైట్‌ ఫోన్‌ వినియోగించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు.



Next Story

Most Viewed