పవన్ కళ్యాణ్ కు చామల కిరణ్ కౌంటర్.. ఇది సినిమా కాదు బ్రదర్ !

by Veldandi saikiran |   ( Updated:2025-04-29 15:11:25.0  )
పవన్ కళ్యాణ్ కు చామల కిరణ్ కౌంటర్.. ఇది సినిమా కాదు బ్రదర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వర్సెస్ఇండియా మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చామల కిరణ్. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వెళ్లిపోవాలని పవన్ కళ్యాణ్... హాట్ కామెంట్స్ చేశారు.

అయితే ఆ కామెంట్లపై తాజాగా ఎంపీ చామల కిరణ్ స్పందించారు. స్క్రిప్ట్ రాసిస్తే చదవడానికి ఇది సినిమా కాదు అంటూ ఎద్దేవా చేశారు కిరణ్. డిప్యూటీ సీఎం హోదాలో స్థాయికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడాలని చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని కాపాడింది కాంగ్రెస్ అంటూ తెలిపారు. నలుగురు ఉగ్రవాదులు వచ్చి కాల్ చెయ్ పోతే వారిని పట్టుకోకుండా ఇన్ని రోజులు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.



Next Story

Most Viewed