ఏమన్నా ఐడియానా బ్రదర్.. టేబుల్ ఫ్యాన్‌కి సీసీ కెమెరా సెట్ చేసి ఎక్కడ పెట్టాడో చూడండి!

by D.Reddy |
ఏమన్నా ఐడియానా బ్రదర్.. టేబుల్ ఫ్యాన్‌కి సీసీ కెమెరా సెట్ చేసి ఎక్కడ పెట్టాడో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: తెలివితేటలు ఒకరి సొత్తు కాదు బ్రో.. ఈ డైలాగ్‌ను మనం నిత్యం చాలాసార్లు వాడుతుంటాం.. వింటూంటాం. దీన్ని నిజం చేస్తూ ఓ వ్యక్తి వినూత్న విచిత్రమైన ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ కావటంతో.. నెటిజన్లు సైతం 'ఇతడిది మామూలు బ్రెయిన్ కాదురా బాబోయ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఓ వ్యక్తి తన ఇంటి భద్రత కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే, ఒకే కెమెరాతో ఇంటి చుట్టూ కవర్ అయ్యేలా వినూత్నంగా మార్గాన్ని ఎంచుకున్నాడు. సాధారణంగా గోడకు అమర్చే కెమెరా స్థానంలో టేబుల్ ఫ్యాన్ హెడ్‌ను (Table fan head) అమర్చాడు. ఆ తర్వాత ఫ్యాన్‌పై సీసీ కెమెరాను (CCTV camera on the table fan) ఫిక్స్ చేశాడు. ఇక ఫ్యాన్ ఆన్ చేయగానే సీసీ కెమెరా కూడా అటూ, ఇటూ తిరుగుతూ మొత్తం కవర్ చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలా ఒకే కెమెరాను ఇలా 360 డిగ్రీల కోణంలో సెట్ చేసిన ఇతడి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. 'ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు' అంటూ ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.




Next Story

Most Viewed