Ram Charan: రామ్ చరణ్ ను అడ్డంగా బుక్ చేసిన ప్రభాస్

by Prasanna |
Ram Charan: రామ్ చరణ్ ను అడ్డంగా బుక్ చేసిన ప్రభాస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆహా ఓటీటీలో బాలయ్య ( Nandamuri Balakrishna ) అన్‌స్టాపబుల్ సీజన్ 4 ( Unstoppable )ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఎనిమిది ఎపిసోడ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా, తొమ్మిదవ ఎపిసోడ్ ప్రొమోను ఈ రోజు విడుదల చేశారు. " గేమ్ ఛేంజర్ " మూవీ త్వరలో రిలీజ్ అవుతుండటంతో రామ్ చరణ్ వచ్చి బాలయ్యతో సందడి చేశారు. రామ్ చరణ్ తో పాటు శర్వానంద్, దిల్ రాజు, నిర్మాత విక్రమ్ కూడా వచ్చి అలరించారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ ఈ షోకి వచ్చారు.

ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో కి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ కి కాల్ చేసి మాట్లాడారు. ఇక ఇప్పుడు, రామ్ చరణ్, ప్రభాస్‌కు ఫోన్ చేయడం వైరల్ గా మారింది. దాంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈ సారి షో లో బాలయ్య ఆ రోజు ఏం జరిగింది అని ప్రభాస్ ని అడగగా , రామ్ చరణ్ టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఇప్పుడు, డార్లింగ్ కూడా గ్లోబల్ స్టార్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు. మీరు నాకు ఫోన్ చేస్తే రామ్ చరణ్ ఎందుకు అంత భయపడిపోతున్నాడంటూ అడ్డంగా బుక్ చేశాడు. వీరిద్దరి బాండింగ్‌ను చూసి అటు మెగా అభిమానులు, ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed