Ram Charan: క్లీంకారాని ఎప్పుడు చూపిస్తారో చెప్పేసిన రామ్ చరణ్.. కామెంట్స్ వైరల్

by Kavitha |
Ram Charan: క్లీంకారాని ఎప్పుడు చూపిస్తారో చెప్పేసిన రామ్ చరణ్.. కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: తాజాగా బాలకృష్ణ, రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇక ప్రోమోలో చరణ్ తన కూతురు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇందులో భాగంగా.. బాలయ్య మాట్లాడుతూ.. 2023 లో మీ నాన్నకు ఒక కొడుకుగా మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్టే అని అన్నారు. అప్పుడు చరణ్ మాట్లాడుతూ.. బక్కగా ఉంటుంది. పొద్దున్నే రోజు రెండు గంటలు తనతోనే గడుపుతాను. నేను తినిపిస్తే తప్ప తినదు అంటూ తన గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

ఇక బాలయ్య.. ఇంతకీ క్లీంకారని ఎప్పుడు చూపిస్తున్నావు అని అడగ్గా చరణ్.. తను నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు అందరికీ క్లీంకారాని చూపిస్తాను అని తెలిపారు. కాగా క్లీంకార ఫేస్ చూపించమని మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో రిక్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ షో ద్వారా చరణ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగా ప్రిన్సెస్ చరణ్‌ని త్వరగా నాన్న అని పిలవాలి అని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed