BRS: రేవంత్‌ రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టాలి

by Gantepaka Srikanth |
BRS: రేవంత్‌ రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టాలి
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుభరోసా(Rythu Bharosa) పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్‌ రెడ్డి నిండా మోసం చేశారని మండిపడ్డారు. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన మాటను తప్పారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌కి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 70 లక్షల మంది రైతులను మోసం చేశారని అన్నారు. ఈ విషయంపై సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని కీలక ప్రకటన చేశారు. రేవంత్‌ రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టాలని అన్నారు.

రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు కాకుండా రూ. 12 వేలు ఇస్తామంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై మండిపడ్డారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్‌ పార్టీ అంటూ ఫైర్‌ అయ్యారు. ధోకాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌ అన్నారు. రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రైతుల వ్యతిరేకి కాంగ్రెస్‌ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. వరంగల్‌ డిక్లరేషన్‌ అబద్ధమని, రాహుల్‌ గాంధీ ఓరుగల్లులో చేసిన ప్రకటన బూటమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఏటా రూ.15 ఇస్తామంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు అమలు చేస్తామంటున్నది రూ.12 వేలని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed