- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bihar: పట్టాలపై కూర్చుని పబ్ జీ.. ముగ్గురు యువకులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్(Bihar)లో పబ్ జీ (PUBG) ముగ్గురు యువకుల ప్రాణం తీసింది. పరిసరాలు గమనించకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గేమ్ ఆడుతున్న ముగ్గుర్ని రైలు ఢీకొట్టడంతో (Bihar Teens Accident) చనిపోయారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కతియాగంజ్-ముజఫర్‌పూర్ మార్గంలో రైలు పట్టాలపై యువకులు కూర్చుని ఫోన్ లో గేమ్ ఆడుతున్నారు. ఆ సమయంలో ఇయనర్ ఫోన్ లు పెట్టుకోవడంతో ట్రైన్ రావడాన్ని గుర్తించలేదు. దీంతో, ప్రమాదం జరిగింది. మృతులను పుర్కాన్ ఆలం, సమీర్ ఆలయం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్‌పై కూర్చొని మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నందునే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే అధికారులు తెలిపారు. మృతుల తల్లిదండ్రుల నుంచి వాంగ్మాలాలు తీసుకుంటామని వెల్లడించారు. అసురక్షిత పరిసరాల్లో.. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, రోడ్లపై మొబైల్ గేమ్‌లు ఆడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల గేమింగ్ అలవాట్లను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.