- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అన్నదాతను అడుగడునా మోసం.. వే బ్రిడ్జి తూకంలో తేడాలు

అన్నదాతను అడుగడునా మోసం చేస్తున్నారు. విత్తనం విత్తిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతన్న కష్టం అంతా ఇంతా కాదు. కష్టించి పండించిన ధాన్యం అమ్మకంలో ధర తో పాటు తూకాల్లో మోసపోతున్నారు. ఒకవైపు ఐకేపీ కేంద్రాలలో తూకంలో మోసాలు. మరోవైపు రైస్ మిల్లుల వద్ద ఉన్న వే బ్రిడ్జి కాంటాలలో మోసాలు వెరసీ రైతన్నలకు నష్టాలను మిగుల్చుతుంది.ఇటీవల వేములపల్లి మండలం శెట్టి పాలెం సమీపంలో ఉన్న శ్రీ రామ్ వే బ్రిడ్జి కాంటాలో తనిఖీలు చేయగా 10 టన్నులకు సుమారు 60 కిలోల వరకు తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించి జరిమానా విధించారు. వే బ్రిడ్జి కాంటాల లో తనిఖీలు కంటి తుడుపు చర్యలేన ని రైతులు పేర్కొంటున్నారు. వందల సంఖ్యలో ఉన్న కాంటాల లో పదికి లోపల తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దిశ, మిర్యాలగూడ టౌన్ : జిల్లాలో సుమారు 100 కు పైగా వే బ్రిడ్జి కాంటాలున్నాయి. వీటిలో ఎక్కువగా రైస్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసుకున్నవి. కాగా మిగతావి జనరల్ వే బ్రిడ్జిలు ఉన్నాయి. ముఖ్యంగా రైస్ మిల్లుల వద్ద ఉన్న వే బ్రిడ్జి కాంటాలలో మోసం ఎక్కువగా జరుతున్నట్లు తెలుస్తోంది. వీటిని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి వీటిపై తనిఖీ లు తక్కువగా ఉండటం అనుభవం కలిగిన ఆపరేటర్లు లేకపోవడం వలన తూకాలలో మోసం జరుగుతుంది. జిల్లాలో ఉన్న వే బ్రిడ్జిలలో మిర్యాలగూడ పరిధిలో ఉన్న మిర్యాలగూడ ,వేములపల్లి మండలాలోని యాద్గార్ పల్లి, అవంతిపురం, శెట్టిపాలెం గ్రామాలలో ఉన్న మిల్లుల వే బ్రిడ్జి కాంటాలపై తూనికల కొలతల అధికారులకు ఎక్కువగా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. దీంతో మిర్యాలగూడ పరిధిలో ప్రత్యేక వాహనంతో వే బ్రిడ్జి కాంటాల లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల వేములపల్లి మండలం శెట్టి పాలెం సమీపంలో ఉన్న శ్రీ రామ్ వే బ్రిడ్జి కాంటాలో తనిఖీలు చేయగా 10 టన్నులకు సుమారు 60 కిలోల వరకు తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించి జరిమానా విధించారు.
లక్షల రూపాయల నష్టం..
వే బ్రిడ్జి కాంటాల వలన అన్మదాతలకు నష్టం వాటిల్లుతుంది. ఒక్క టన్ను ధాన్యం కు 6 నుంచి 8 కిలోల వరకు నష్టం జరుగుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు . అదే లారీలలో అయితే క్వింటాళ్ల వరకు తేడాలు వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఈ విధంగా ఖరీఫ్ , రభీ సీజన్‌లో ఈ తూకాల లో మోసం వలన మిల్లర్లు లక్షల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తూకాలలో తేడాలతోి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. యాద్గార్ పల్లి సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లులో ఇటీవల ఓ రైతుకు సుమారు 50 కిలోల తేడా రావడంతో యాజమానితో వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది.
కంటి తుడుపు తనిఖీలే
వే బ్రిడ్జి కాంటాలలో తనిఖీలు కంటి తుడుపు చర్యలేన ని రైతులు పేర్కొంటున్నారు. వందల సంఖ్యలో ఉన్న కాంటాలలో పదికి లోపల తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటి నిర్వహణపై తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేడాలను గుర్తించిన అధికారులు అంతంత మాత్రంగా చర్యలు తీసుకుంటుండటంతో నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రత్యేక వాహనంతో తనిఖీలు..
వే బ్రిడ్జి కాంటాలను తనిఖీ చేసేందుకు జిల్లా తూనికలు కొలతల అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. ఈ వాహనం 10 టన్నుల సామర్థ్యం కలిగి క్రేన్ సౌకర్యం కూడా ఉన్నది.10 టన్నుల సామర్థ్యం కలిగిన వే బ్రిడ్జి లను దీని ద్వారా తనిఖీ చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి వాహనాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికి నల్గొండ జిల్లాలకు వాహనం కేటాయించి తనిఖీలు చేస్తున్నారు. ఒక్కొక్క కాంటాలను తనిఖీ చేసేందుకు సుమారు 2 గంటల సమయం పైగా పడుతుంది. ఈ తనిఖీలు ఖరీఫ్ , రభీ సీజన్‌లో ధాన్యం అమ్మకాల ప్రారంభంలో తనిఖీలు చేస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు .