అధిక లోడుతో రోడ్డెక్కుతున్న టిప్పర్లు..

by Aamani |
అధిక లోడుతో రోడ్డెక్కుతున్న టిప్పర్లు..
X

దిశ, కొత్తూరు : అధిక లోడుతో టిప్పర్లు రోడ్డెక్కుతున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని సిద్దాపూర్ , ఇనుముల్ నర్వ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. క్రషర్ నిర్వాహకులు రహదారి నిబంధనలను పాటించకుండా ఓవర్ లోడ్ తో కంకరను రవాణా చేస్తూ జేబులు నింపుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి వేళలో ఓవర్ లోడ్ తో అతి వేగంగా గ్రామం మీదుగా వెలుతున్నారని వాపోతున్నారు. మండలం లో నిబంధనలకు విరుద్ధంగా.. అధిక లోడు తో తిరిగే లారీ డ్రైవర్ల పై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అధిక లోడుతో వెళ్తూ.. కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిస్తున్న వాహనాలపై అధికారుల ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed