- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన పనిచేయని నిఘా నేత్రాలు..
దిశ, ఏర్గట్ల : నేరాల సంఖ్యను తగ్గించాలని ఆరెండ్ల కిందట ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిమ్మక ఉండిపోయాయి. నేరాలు నియంత్రించాలనే ఉద్దేశ్యంతో మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసుల ప్రోద్బలంతో నేను సైతం కార్యక్రమాలతో పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజాప్రతినిదులు, వ్యాపారస్తులు, కుల సంఘాల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన వారి ప్రోద్బలంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ కెమెరాల వ్యవస్థ పూర్తిగా మూలనపడడంతో దాతలు చేసిన సహకారమంతా బూడిదలో పోసిన పన్నీరైందని గ్రామస్తులు వాపోతున్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం అన్న సూక్తిని పలు సందర్భాల్లో పోలీస్ అధికారులు వల్లించిన ఆచరణలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిఘా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. ఏర్గట్ల మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు,కుల సంఘాలు, వివిధ సంఘాల సహకారంతో పోలీసులు ఆరేండ్ల క్రితం డబ్బులు సేకరణ చేశారు. ఆ డబ్బు సేకరణలో గ్రామంలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏర్పాటైన తొలి రోజుల్లో కొంత వరకు బాగానే పనిచేశాయి. తర్వాత సీసీ కెమెరాలు పని చేస్తలేవని సాంకేతిక నిపుణులు వాటిని సరి చేశారు కానీ అవి ఇప్పుడు పనిచేయడం లేదు.
ఏదైనా జరిగితే ఎలా పరిష్కరిస్తారు..?
గత నెల డిసెంబర్ 31న కొందరు ఆకతాయిలు మోటారు సైకిల్ పై గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ విషపూరితమైన మొక్కజొన్న విత్తనాలు, వరి గింజలను చల్లడంతో గ్రామంలోని కొంతమందికి చెందిన పెంపుడు నాటు కోళ్లు ఆ గింజలు తిని పదుల సంఖ్యలో మృత్యువాత పడినట్లు నాటు కోళ్ల యజమనులు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ. 4 నుంచి 5 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని వాపోయారు. మండల కేంద్రంలో మూడో నేత్రాలు పనిచేయకపోవడంతో వాటి పర్యవేక్షణ లేకపోవడంతో నిఘా వ్యవస్థ మూలన చేరిందని ఒకవేళ కెమెరాలు పని చేసినట్లయితే వాటి ద్వార ఆకతాయిలను గుర్తించే వారమని అన్నారు. కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా కూడా పోలీస్ అధికారులు వాటికి మరమ్మత్తులు కూడా చేయించడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆరేండ్ల క్రితం వీటిని ఏర్పాటు చేయించడం లో ఉన్న శ్రద్ధ మరమ్మతులు చేయించడంలో దృష్టి పెట్టడం లేదని చందాలు ఇచ్చిన దాతలు, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. మంచి సదుద్దేశ్యంతో డబ్బులు ఇచ్చి సీసీలు ఏర్పాటు చేసినా నిఘా వ్యవస్థ మూన్నాళ్ల ముచ్చటగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
పట్టించుకునే నాథుడే కరువయ్యాడు..
గత సంవత్సరం సర్పంచ్ పదవీకాలం ముగియడంతో సంవత్సర కాలం నుండి ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం తో గ్రామ పంచాయతీ పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రత్యేక అధికారులకు నిధులు లేకపోవడంతో సిసి కెమెరాల పునరుద్ధరణ, గ్రామ కమిటీ లేదా, పోలీస్ అధికారులు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మరొక సంఘటన జరగక ముందే సీసీ కెమెరాల పునరుద్ధరణ, గ్రామ కమిటి లేదా పోలీస్ అధికారులు వీలైనంత తొందరగా త్వరితగతిన చేపట్టాలని, సీసీ కెమెరాల పునరుద్ధరణ ఎవరు చేస్తారో అని దాతలు, గ్రామ ప్రజలు వేచి చూస్తున్నారు.