- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు షురూ..
by Aamani |
X
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇన్నాళ్లు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో కూల్చివేతలు చేపట్టింది. శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ల రహదారికి ఆనుకుని ఉన్న 5 అంతస్తుల భవనం కూల్చివేత మొదలైంది. శనివారం సాయంత్రం కూల్చివేతలు చేపట్టాలని ప్రయత్నాలు చేసినా చీకటి పడడం, ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ఆదివారం ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు. అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణం వద్ద పోలీసులు, హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. పోలీసుల భద్రత మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండడంతో పవర్ సప్లై నిలిపివేసిన అధికారులు, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా చర్యలు తీసుకున్నారు.
Advertisement
Next Story