కోళ్లవ్యాన్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు దుర్మరణం

by Aamani |
కోళ్లవ్యాన్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు దుర్మరణం
X

దిశ, కోటగిరి : కోళ్ల వ్యాన్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దేవుని గుట్ట తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం నాగేంద్ర పురానికి చెందిన గైని పవన్ (27)అనే యువకుడు వ్యవసాయ పనుల కోసం బైక్ పై పొలానికి వెళ్తుండగా దేవుని గుట్ట తండా వద్దు ఎదురుగా వస్తున్న కోళ్ల వ్యాన్ ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి 108 కి సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని బోధన్ ఏరియా తరలించాగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ తరలించగా జిల్లా ఆసుపత్రిలో యువకుడు మరణించినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed